ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అనేవాడు ఎంతో స్పెషల్ గా నిలుస్తారు. చిన్నతనం నుంచి ఏదంటే అది తీసుకొస్తూ తన కష్టాన్ని తెలియకుండా కుటుంబ భారాన్ని మోస్తూ ఉండే తండ్రి అంటే ఏ బిడ్డలకి ఇష్టం ఉండదు చెప్పండి. సినిమాల్లో తండ్రి పై ప్రేమను మన సెలబ్రిటీ లు బాగానే చూపించారు.ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు మన తెలుగు సినిమా దర్శకులు. ప్రతి హీరో తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం అని తెలియజేసే విధంగా సినిమాలు చేసి ఆ సినిమాలను తమ తల్లిదండ్రులకు అంకితం ఇచ్చారు. అలా అల్లు అర్జున్ తన తండ్రికి అంకితం ఇస్తూ చేసిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా 2015 సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా ప్రతి ఒక్క తండ్రి, బిడ్డలని ఎంతగానో అలరించింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్నేహితులు, బంధువుల ఇళ్ళల్లో జరిగిన ముఖ్యమైన ఘటనలకు నాటకీయత జోడించి సినిమాలోని సన్నివేశాలు రాసుకున్నాడట, వేగేశ్వరపురం లో ని అమ్మ మేనమామల జీవితాన్ని స్ఫూర్తిగా స్వీకరించి సినిమాలో ఎమ్మెస్ నారాయణ, రమేష్ ల మధ్య కీలకమైన ఘట్టాన్ని రాసినట్లు త్రివిక్రమ్ వెల్లడించాడు, ఆ కుటుంబంలో తన అన్న ఎక్కడ సొంతం పెట్టమంటే అక్కడ పెట్టిన తమ్ముడు ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాలుగా కలిసి ఉమ్మడిగా జీవించిన కుటుంబం వంటి అంశాలు సినిమా లోని ముఖ్య కథ వెనుక ప్రేరణ అని ఆయన వెల్లడించారు.

తండ్రి హఠాత్ మరణం తో ఆయన చెప్పిన విలువల్ని కాపాడుకోవడం కోసం 300 కోట్ల ఆస్తి వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అక్కడి నుంచి మళ్లీ జీవితాన్ని ప్రారంభించిన హీరో తన కుటుంబ పరువును ఎలా కాపాడుకొని పైకి వచ్చాడు. తనకు విలువలను నేర్పిన తండ్రి ని ఎలా గర్వించేలా చేశాడు అనేది ఈ సినిమా అసలు కథ. సమంత హీరోయిన్ గా కన్నడ నటుడు ఉపేంద్ర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: