టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది రష్మిక మందన. వరస పెద్ద హీరోల సినిమాలతో ఏ హీరోయిన్ లేని పొజిషన్లో ఈమె ఉంది. చలో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ కన్నడలో అప్పటికే మంచి పేరున్న హీరోయిన్ గా రాణిస్తుంది ఈమె చేసిన తొలి చిత్రంతో పాటు రెండవ చిత్రం గీత గోవిందం కూడా సూపర్ హిట్ కావడంతో ఈమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు రష్మిక.

ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమెను పెద్ద సినిమాల లో పెట్టుకోవడానికి హీరోలు ఎంతో ఆసక్తి చూప గా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మార్చారు. ఆ తర్వాత పెద్ద సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్న రశ్మితా భీష్మ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప సినిమాతో పాటు మరిన్ని పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్లో కూడా ఈమె కొన్ని సినిమాలు సైన్ చేసి అక్కడ రాణించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

అంతేకాకుండా ఇటీవలే కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను ఒప్పుకునే దిశగా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తాను నటించిన హీరోలను పొగడడం లో కాజల్ మరియు సమంత ను మించిపోయింది. సినిమా అవకాశాల కోసం ఏ హీరోయిన్ అయినా హీరో లను పొగడడం సహజం కానీ పొగడడం లో కాజల్ సమంత లను మించిపోయింది రష్మిక. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తి పొగడడం వారిని గుర్తు చేస్తుంది. ఏదేమైనా దీపం ఉన్నప్పుడే రష్మిక ఇల్లు చక్కదిద్దుకుంటూ హీరోలను కూడా కాక పడుతూ వెళుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: