భారీ అంచనాల మధ్య బాలయ్య అఖండ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాకి పై నుంచి కింద వరకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఆ పాత్రలో బాలయ్య అదరగొట్టేశాడు అని చెపుతున్నారు. సింహ - లెజెండ్ ను మించి ఉందని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా బాలకృష్ణ బోయపాటి శీను ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో పవర్ ఫుల్ ఎనర్జీతో నటించాడు.

అలాగే రెండు పాత్రలకు కూడా అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయి. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప్రతి 10 నిమిషాలకు సినిమా గ్రాఫ్ ఎక్కడా తగ్గకుండా.. పవర్ ఫుల్ డైలాగ్ లతో , యాక్షన్ సీన్స్ తో సినిమాను స్పీడ్‌గా నడిపించాడు. అయితే పాటలు అనుకున్న స్థాయిలో జనాలకు ఎక్కక‌ పోయినా.. వాటిని తెర‌మీద‌ చూసినప్పుడు మాత్రం అదిరిపోయే ఫీలింగ్ కలిగింది. థ‌మన్ పాటల కంటే నేపథ్య సంగీతం తో సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించాడు అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

ఇక ఇంటర్వెల్ సీన్ అయితే లెజెండ్ ఇంటర్వెల్ సీన్ ను మై మ‌ర‌పించింది అని.. ఇంటర్వెల్ సీన్ తో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళి పోయింది అని చెబుతున్నారు. ఇక ఓవ‌రాల్ గా సినిమా బాల‌య్య బాబు వ‌న్ మ్యాన్ షో అయ్యింది. థియేట‌ర్లు అన్ని కూడా జై బాల‌య్య కీర్త‌న‌ల‌తో మారు మోగుతున్నాయి. ఇటీవల కాలంలో బాలయ్య అభిమానులకు ఇంత ఎంజాయ్ చేసే రేంజ్లో సినిమా అయితే రాలేదు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల తోపాటు విదేశాల్లో ఉన్న బాలయ్య అభిమానులు ఓ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చినా కూడా బాలయ్య ఎనర్జీ ఇంచ్‌ కూడా తగ్గలేదు. ఈ విష‌యం అఖండ తో మరోసారి ప్రూవ్ అయిందని వారు చెబుతున్నారు. ఇక అఖండ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: