ప్రస్తుతం రాజమౌళి మెగాహీరో అదేవిధంగా నందమూరి హీరో తో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తుండగా తర్వాత చేసే సినిమా కూడా భారీ మల్టీస్టారర్ సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారని దీనికి సంబంధించి మహేష్ బాబు ని అలాగే మరో హీరోనీ కూడా ఒప్పించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంలో రాజమౌళికి ఏమాత్రం కూడా భయపడకుండా ముందడుగు వేయడమే కాకుండా కొంత మంది అగ్ర నిర్మాత నుంచి భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు రాజమౌళి తన సినిమాల్లో పెద్దగా పెట్టుబడులు పెట్టిన పరిస్థితి లేక పోగా భవిష్యత్తు సినిమాల విషయంలో మాత్రం భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని త్వరలోనే ఆయన ఒక కీలక అడుగు వేయ పోతున్నారని కొన్ని కొన్ని ప్రకటనలు కూడా ఆయన నుంచి రావొచ్చని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ అలాగే మహేష్ బాబు ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అల్లు అర్జున్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ సినిమా కాస్త అహింసా మార్గంలో ఉంటుంది అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.