సినిమా ఇండస్ట్రీలో వారసులు ఉండటం సహజమే. అలాంటి ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు కలిసి నటిస్తే చూడాలని ఆ కుటుంబ అభిమానులకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇతర సినిమా పరిశ్రమలలో కూడా ఒకే కుటుంబానికి చెందిన కొంత మంది హీరోలు ఉన్నారు. అలా తమిళ సినిమా పరిశ్రమలో అన్నదమ్ములుగా ఉన్న హీరోలు సూర్య మరియు కార్తీ. ఇప్పుడు అక్కడ టాప్ హీరోలు గా ఉన్న వారికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.

 వారు నటించిన సినిమాలు అన్ని కూడా తెలుగులో కూడా విడుదల అవుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్నాయి. ఆ విధంగా వీరిద్దరూ ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా లో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తు ఉండగా ఈ సినిమా కు త్రివిక్రమ్ రచయిత గా వ్యవహరిస్తున్నారు. మలయాళ అయ్యపనుం కోషీయం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి కేవలం ఇతి వృత్తాన్ని మాత్రమే తీసుకుని ఒరిజినల్ సినిమా కి  డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నారట.

అయితే ఈ సినిమా కథను మెచ్చిన ఈ ఇద్దరూ తమిళ బ్రదర్స్ వారు హీరోలుగా ఈ సినిమా చేయాలని భావిస్తున్నారట. వాస్తవానికి ఎప్పటినుంచో ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ అభిమానులు కోరికతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆశ అది. అయితే ఎప్పటికీ స్టోరీ సరిగ్గా దొరకకపోవడంతో ఇది వాయిదాపడుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి తెలిసిన తరువాత సూర్య ఎంతో ఆసక్తిగా ఈ సినిమా చేయాలని చూస్తున్నాడట.కార్తీ కూడా దీనిపై తన మనసులో మాట చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఓకే అయితే ఈ ఇద్దరు సోదరుల కలయికలో నటించాలనే అభిమానుల కల నెరవేరినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: