టాలీవుడ్ స్టార్ లెజెండరీ యాక్టర్ నాగేశ్వర రావు మనవడిగా..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కొడుకుగా..ఇండస్ట్రీలో నాగచైతన్య కు మంచి పేరు ఉంది. పేరుకి పెద్ద హీరో కొడుకు అయినా కానీ సింప్లిసిటీ నే ఇష్టపడతారు చైతన్య. లేనిపోని గొప్పలకు పోయి ఉన్న మాట లేని మాట మాట్లాడడు అని ఆయనతో వర్క్ చేసిన నటీనటులు అంటుంటారు. షూటింగ్ సెట్ లో కూడా ఎంతో కలివిడిగా ఉంటాడు నాగచైతన్య అందరితో అంటుంటారు ఆయనతో వర్క్ చేసే వాళ్ళు. రీసెంట్ గా తండ్రి తో కలిసి బంగార్రాజు అనే సినిమాలో నటించిన చై ..సినిమాలో తన నటనకు గాను మంచి మార్కులే వేయించుకున్నారు.

ఇక ఈ సినిమాలో ఆయన మొదటిసారి ఫుల్ చిల్ ఔట్  క్యారెక్టర్ లో కనిపించగా మాస్ లుక్ లో అదరగొట్టేసారు. చైతన్య పక్కన మొదటిసారి హీరోయిన్ గా చేసిన కన్నడ సోయగం కృతిశెట్టి కూడా ఫుల్ మాస్ లుక్ లో లేడి టైగర్ లా ఆయనతో పోటీ పడి నటించి సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ సమంత పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. విడాకులు  తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాక ఫస్ట్ టైం చైతన్య సమంత గురించి మాట్లాడడం..అది కూడా పాజిటివ్స్ కామెంట్స్ కావడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా నెట్టింట ట్రెండ్  అవుతుంది.

బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ  మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆయన పాల్గొనగా ..యాంకర్ చైతన్యను తాను న‌టించిన అన్నీ సినిమాల హీరోయిన్స్‌లలో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో మీకు కుదిరిందని ప్రశ్నించగా.. చైతన్య ఆలోచించకుండా టక్కున ..సమంత పేరు చెప్పేసాడు. ‘ఇప్పటి వరకు నాకు బెస్ట్‌ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే అది సమంతతోనే  బాగా కుదిరింది’ అంటూ త‌డుముకోకుండా జవాబు ఇవ్వడం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది.  విడాకుల తరువాత చైతన్య సమంత పై ఇంత పాజిటీవ్  కామెంట్స్‌ చేయడంతో ప్రస్తుతం నెట్టింట ఈ మాటలు హాట్‌టాపిక్‌గా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: