నాగచైతన్య ప్రస్తుతం లవ్‌ స్టోరీ, బంగార్రాజు వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. అంతేకాదు  నాగచైతన్య వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు.అయితే ఇప్పటికే థాంక్యూ సినిమాను పూర్తి చేశాడు చైతన్య. ఇక ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ చిత్రంపై అంచనాలు పెంచేసింది.కాగా  క్లాస్‌ లుక్‌లో కనిపించిన నాగ చైతన్య మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా ప్రేక్షకులు ముందుకు రాకముందే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రానికి చైతన్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అయితే ఈ సినిమాతోపాటు పరశురామ్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు.ఇకపోతే  14 రీల్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కాగా సర్కారు వారి పాట వంటి సూపర్‌ హిట్‌ తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాకు చిత్ర యూనిట్ ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌ను ఓకే చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య మధ్య తరగతి అబ్బాయి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.అయితే  మధ్య తరగతి కుర్రాడికి, కంపెనీ సీఈఓ స్థాయిలో ఉన్న అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ సినిమా నేపథ్యమనే ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ పనులు తుది దశలో ఉన్నాయి. అంతేకాకుండా స్క్రిప్ట్‌ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.ఇక ఈ సినిమాతో పాటు అటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు నాగచైతన్య. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగిటివ్ రోల్ పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: