ఒకరికి ఒకరు అనే క్లాసికల్ హిట్ చిత్రంలో నటించారు హీరో శ్రీరామ్. వాస్తవానికి తెలుగువారైన కానీ తమిళంలో స్థిరపడి పోయి ఇక్కడ తెలుగులో కొన్ని కొన్ని చిత్రాల్లో మాత్రమే నటిస్తూ ఉన్నాడు. అలా కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నాడు అవికాగోర్ శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టెన్త్ క్లాస్ డైరీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. గరుడవేగ అంజి ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తారీకు న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సందర్భంగా తాజాగా చిత్రబృందం ప్రమోషన్లలో వేగవంతం చేసింది శ్రీరామ్ తన గతంలో చేదు అనుభవం గురించి తెలియజేశారు కష్టలలో ఉన్న సమయంలో నిర్మాతలు తనకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి తీసుకున్నారని తెలిపారు. తన జీవితంలో ఒకరికి ఒకరు చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అని తెలిపారు తనకు యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులపాటు బెడ్ మీద ఉండాల్సి వచ్చిందని తెలిపారు. హాస్పిటల్ లో ఉన్న సమయంలో రసూల్ ఎల్లోర్ వచ్చి సినిమా తీస్తే నీతోనే తీస్తాను లేదంటే లేదు అని చెప్పి ఎన్నో రోజులు వెయిట్ చేసి ఒకరికొకరు అనే సినిమాను తీశారట.


ఆ తరువాత ఇంకో సినిమాటోగ్రాఫర్ వచ్చి అవకాశం ఇవ్వడం తో టెన్త్ క్లాస్ డైరీ సినిమాలో నటించాను. దీంతో హ్యాపీగా ఉంది అంజి గారిలో నేను సరైన దర్శకుడిని చూశాను చాలా మంది విజువల్స్ మీద దృష్టి పెడతారు కానీ ఈయన మాత్రం స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టారని తెలియజేశారు. ఒక నిర్మాత చక్కగా కథ చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు మా నిర్మాత రామారావు గారు ఈ సినిమా కథను రాయడం జరిగింది నాకు ఆయనే చక్కగా వివరించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: