గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై గీతాఆర్ట్స్ నిర్మించింది. యాక్షన్ తో కూడిన కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తెరకెక్కించారు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ లో ని బాగా వేగవంతం చేశారు. తాజాగా ఈ నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా శిల్పకళావేదికలో హైదరాబాదులో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి రావడం జరిగింది.


కరోనా తర్వాత ఇంత మంది అభిమానులు తరలి రావడం చూస్తుంటే తనకు చాలా ఉత్సాహంగా ఉంది అంటు చిరంజీవి తెలిపారు. రేపటి రోజున ఈ సినిమాకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే విషయం ఇక్కడే కనిపిస్తుంది అని తెలిపారు. స్టేజ్ పైన ఉన్న వాళ్లంతా కూడా ఈ ఫంక్షన్ కి వీరి కోసం వచ్చానని అనుకుంటున్నారు కానీ నేను వచ్చింది అభిమానుల కోసం మీరిచ్చే ఉత్సాహం కోసమే అని తెలియజేశారు. గోపీచంద్ తో తనకు చాలా అనుబంధం ఉందని అదేమిటని అనుమానం చాలా మందికి ఉంటుంది తన తండ్రి ఒంగోలులో బీకాం ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఆ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాను అని తెలిపారు.


ఆయన తన నుంచి ఎలాంటి సహకారం కావాలన్న ఉంటుందని తనకు భరోసా ఇవ్వడం జరిగిందట అలాంటి ఆయన నాకు ఎప్పుడూ కూడా ఒక హీరోగా కనిపించే వారిని ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయినా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు పొందారని.. ఆయన వారసత్వాన్ని గోపీచంద్ కొనసాగిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు చిరంజీవి. ఇటీవల డైరెక్టర్ మారుతి కూడా తన మార్పును ప్రతి సినిమాతో పెంచుకుంటూ వెళుతూ ఉన్నారని తెలిపారు. ఇక ఈయనతో సినిమా తియ్యమని యువి వంశీ అడిగారని దాంతో నేను హ్యాపీ గా ఒప్పుకున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: