హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత వరుస పరాజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్నప్పటికీ స్వామిరారా సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తరువాత కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి డిఫరెంట్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే నిఖిల్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం నిఖిల్ , చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. కార్తికేయ 2 సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకొన్న కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.

కొంతకాలం క్రితం కార్తికేయ 2 సినిమాను జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని పెండింగ్ లో ఉండటంతో ఈ సినిమాను జులై 22 వ తేదీన పోస్ట్ ఫోన్ చేసి , ఆగస్ట్ నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: