తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయినా రాశి కన్నా గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోల సినిమాలలో నటించిన రాశి కన్నా ఆ మూవీలతో మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం రాశి కన్నా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ మోస్ట్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం రాశి కన్నా కు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పరాజయాలు బాక్సాఫీస్ దగ్గర ఎదురవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకులను పలకరించిన రాశి కన్నా కు ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం ఎదురైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పక్కా కమర్షియల్ మూవీ తో రాశి కన్నా తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది.

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 1 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రాశి ఖన్నా కు విజయాన్ని తీసుకురాలేకపోయింది. అలాగే ఈ నెల 22 వ తేదీన విడుదల అయిన థాంక్యూ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించగా విక్రమ్ కె కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా రాశి కన్నా ఒకే నెలలో రెండు అపజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: