మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అమీర్ ఖాన్ ఇప్పటికే తాను నటించిన మూవీ లతో ప్రపంచ వ్యాప్తంగా అదిరి పోయే క్రేజ్ ను సంపాదించుకోవడం  మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు .

అమీర్ ఖాన్ ఆఖరు గా తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అమీర్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు. ఈ సినిమా ఆగస్ట్ 11 వ తేదీన హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఈ మూవీ ని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు.

మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ మూవీ పై అంచనాలను కూడా మరింతగా పెంచింది. ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ రన్ టైమ్ ని లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 44 నిమిషాల 50 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అద్వైత్ చందన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: