యాంకర్  ప్రదీప్ బుల్లితెర స్టార్ అని అందరూ అంటూ ఉంటారు. ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ పై మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లి తెరపై తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న యాంకర్ ప్రదీప్ హీరోగా కూడా ఒక సినిమాను ప్రయత్నించిన విషయం తెలిసిందే.

ఆయన హీరోగా చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ ఆయనకు హీరోగా మంచి ఫ్యూచర్ ఉంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు, కానీ ప్రదీప్ మాత్రం హీరోగా వరుసగా ప్రయత్నించకుండా మెల్లగా చూద్దాం అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు.

ఇప్పటి వరకు హీరోగా రెండవ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం మనకు అందుతుంది. ఇక యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక షో లో లేదా ఇంటర్వ్యూలో చర్చ జరుగుతూనే ఉంటుంది.

తాజాగా ప్రదీప్ ఒక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన సందర్భంగా పెళ్లి విషయం ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ నా పెళ్లి అయిపోయింది కదా మీకు తెలియదా అంటూ గాటు వ్యాఖ్యలు చేశాడు.. ఆ సందర్భంలో అంతా కూడా నోరు వెళ్లబెట్టారు.

ఆ వెంటనే ఒక్కటి కాదు నాలుగైదు పెళ్లిలను యూట్యూబ్ వారు చేశారు, యూట్యూబ్లో నా పెళ్లి ల గురించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. నా పెళ్లిల గురించి నాకే తెలియకుండా వారికే ఎక్కువగా తెలుస్తుంది అంటూ యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేసే వారికి కౌంటర్ ఇచ్చాడు.

ఇంతకు యాంకర్ ప్రదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే విషయంలో మాత్రం  ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రదీప్‌ రెండో సినిమా కోసం మరియు పెళ్లి ప్రకటన కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రెండు ప్రకటనలు ఎప్పుడెప్పుడు వస్తాయో కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: