గుణశేఖర్ టాలెంట్ ఉన్న దర్శకుడు. ఆయన నుంచి ఎన్నో హిట్టు సినిమాలు కూడా వచ్చాయి. అతడి స్క్రీన్ ప్లేకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. 'చూడాలని ఉంది', 'ఒక్కడు' ఇలా బలమైన కథలతో సినిమాలు తీశారాయన.


అయితే ఈ మధ్యకాలంలో ఆయన టెక్నికల్ విషయాలపై దృష్టి పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. దానికి పెద్ద ఉదాహరణ 'రుద్రమదేవి'. ఈ సినిమాను భారీగా తీయాలనుకున్నారు గుణశేఖర్. దానికి తగ్గట్లుగా పాపులర్ స్టార్స్ ను  కూడా తీసుకున్నారు. సొంత బ్యానర్ ద్వారా భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు.


 


త్రీడీ వెర్షన్ ను కూడా ఆయన రిలీజ్ చేశారు. కానీ త్రీడీ ఎఫెక్ట్స్ పెద్దగా కనిపించలేదు. దీనికోసం చాలా ఖర్చు చేశారు. కానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అంతకుముందు కళ్యాణ్ రామ్ 'ఓం' సినిమాను త్రీడీలో తీశారు. అది కూడా డిజాస్టర్ అయింది. త్రీడీ ఎఫెక్ట్స్ ఆ సినిమాకి మాత్రం కలిసి రాలేదు. తెలుగులో త్రీడీ అంటే రాజమౌళి కూడా భయపడిపోతారు. ఇప్పటివరకు ఆయన త్రీడీ జోలికి వెళ్లలేదు. మనవాళ్లు త్రీడీ ఫార్మాట్ కు పెద్దగా అడాప్ట్ కాలేదనిపిస్తుంది.


 


అయినప్పటికీ.. గుణశేఖర్ ఇప్పుడు 'శాకుంతలం' సినిమాను త్రీడీలో చూపించాలనుకుంటున్నారు. దీనికోసం మరికొంత డబ్బు, సమయం ఖర్చవుతాయి. దానికి తగ్గ రిజల్ట్ ఉంటుందా..? అంటే గ్యారెంటీ కూడా లేదు. పైగా ఇప్పటికే ఈ సినిమాపై బాగా ఖర్చు పెట్టారు గుణశేఖర్. త్రీడీలో మరింత బడ్జెట్ పెరుగుతుంది. మరింత రిస్క్ తీసుకొని త్రీడీను ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారో గుణశేఖర్ కే తెలియాలి. ముందుగా నవంబర్ 4న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త డేట్ ను వారు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే గుణశేఖర్ రుద్రమదేవి సినిమాతో మంచి కాన్సెప్ట్ చెప్పాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా ఎలా వుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: