20 ఏళ్ల నుంచి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో హీరోయిన్ త్రిష కూడా ఒకటి.కెరీర్ మొదలైనప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందాన్ని మెయిన్ టైన్ చేస్తూ సత్తా చాటుతుంది. రీసెంట్ గా వచ్చిన ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించిన ఆ హీరోయిన్ త్వరలో మరో క్రేజీ మూవీలో నటిస్తుందట. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుందని టాక్. ఇంతకీ ఆ అందాల భామ ఎవరు అంటే త్రిష అని తెలుస్తుంది.


నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన త్రిషా ఇప్పటికీ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూనే ఉంది. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ డౌన్ అయినా మళ్లీ పుంజుకుంది అమ్మడు. అంతేకాదు ఈమధ్య వచ్చిన పి.ఎస్ 1 సినిమాలో తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది త్రిష. అలాంటి త్రిష కెరీర్ లో ఫస్ట్ టైం వేశ్య పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. అదికూడా సీనియర్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న సినిమాలో త్రిష అలాంటి ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తుందట. ఓ విధంగా ఇది త్రిషకి రిస్క్ అనిపించేదే అయినా ఈ టైం లో అలాంటివి చేస్తేనే మరికొన్నాళ్లు ఛాన్సులు వస్తాయని ఫీల్ అవుతుంది.


కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఓ హీరో చేతుల్లో మోసపోయిన త్రిష ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డది. అంతేకాదు ఒకసారి ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన మ్యారేజ్ క్యాన్సిల్ అవడంతో ఆమె ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచనని పక్కన పెట్టింది. ఫైనల్ గా త్రిష వేశ్యగా చేస్తుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆమెలోని ఈ యాంగిల్ ని చూడాలని ఆరాట పడుతున్నారు. మరి రిస్క్ చేసి మరీ త్రిష చేస్తున్న త్రిష ఈ మూవీతో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందొ చూడాలి. త్రిష మాత్రం ఈ పాత్రని చాలా ఛాలెంజింగ్ తీసుకుందని,అన్నీ పాత్రలు చెస్తె జనాలు ఇష్టపడతారని ఆమె నమ్ముతుంది.ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: