సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది రాజకీయాల్లో రాణించారు. అలాంటి వారిలో జయలలిత గారు కూడా ఒకరు.ఈమె తన అందంతో అభినయంతో సినిమాల్లో మెప్పించి తన రాజకీయ చతురతతో రాజకీయాల్లో కూడా స్టార్ అయింది.అలాంటి జయలలితని తమిళనాడులో అమ్మగా పిలుస్తారు. రాష్ట్రాన్ని పరిపాలించి తమిళనాడుకి తల్లయ్యింది. అయితే అలాంటి జయలలిత గురించి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం. మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది మహిళా మణుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు జయలలిత గారి గురించి తెలుసుకుందాం. 1948 ఫిబ్రవరి 24న జయరాం వేదవల్లి దంపతులకు జయలలిత జన్మించింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి.కానీ చదువుకునేటప్పుడు ఆమె పేరు జయలలితగా మార్చారు.

 ఇక జయలలిత ఇష్టం లేకున్నా కూడా ఫ్యామిలీ బలవంతంతో తన 15 సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఎన్నో సినిమాల్లో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అంతేకాదు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అనే బిరుదుతో జయలలితని సత్కరించారు. అలా సినిమాల్లో రాణించాక రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. అన్నా డీఎంకే పార్టీలో చేరి చివరికి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళింది. అలా ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని పాలించింది. అంతేకాదు ఈమె చనిపోయే వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలోనే ఉంది. ఇక అధికారంలో ఉన్న సమయంలో చాలామంది చాలా రకాలుగా ధనాన్ని సంపాదించుకుంటారు. అలా జయలలిత కూడా లెక్కకు మించిన ఆస్తులను, బంగారాన్ని, డబ్బులను సంపాదించుకుంది.

దాంతో ఈమె సంపాదించిన సంపాదన మొత్తం చివరికి తమిళనాడు ప్రభుత్వానికి సొంతమైంది.కోట్ల విలువ చేసే డబ్బులు, కోట్ల విలువ చేసే ఇల్లు, కిలోల కొలది వెండి బంగారం ఇలా ఎన్నో సంపాదించినప్పటికీ చివరికి దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు పెళ్లి చేసుకోక వారసులు లేకపోవడంతో ఆ ఆస్తంతా తమిళనాడు ప్రభుత్వానికి చెందింది. అలా సినిమాల్లో అభిమానులు అలరించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన జయలలిత కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కుంది.ముఖ్యంగా పెళ్లి అయిన శోభన్ బాబుని ప్రేమించి ఆయనతో పెళ్లి వరకు వెళ్ళింది.కానీ శోభన్ బాబు మాత్రం జయలలితని పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా ఎంజీఆర్ వంటి నటుడు రాజకీయ నాయకుడితో జయలలిత సంబంధం కూడా పెట్టుకున్నట్లు ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయంలో ఉన్నది ఎంత నిజమో తెలియదు. ఇక చివరికి జయలలిత 2016 డిసెంబర్ 5 రాత్రి 11:30 గంటలకు అనారోగ్య కారణాలతో మరణించింది. ఇక జయలలిత జీవితం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈమె జీవితం ఓ గుణపాఠంగా కూడా అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: