తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రోజురోజుకి ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధించగా.... మరి కొంతమంది విఫలమవుతున్నారు. సక్సెస్ సాధించిన హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఈ భామ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రవితేజ హీరోగా నటించారు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పెద్దగా కనెక్షన్లను సాధించలేదు. కానీ ఈ సినిమా వల్ల భాగ్యశ్రీకి మాత్రమే అదృష్టం కలిసి వచ్చింది.

 భాగ్యశ్రీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ వరుసగా సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. ఇదిలా  ఉండగా ప్రస్తుతం ఈ భామ దుబాయ్ కి వెకేషన్ కి వెళ్లారు అక్కడ స్కై డైవింగ్ చేశారు.

దానికి సంబంధించిన విషయాలను ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ "వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్" అని క్యాప్షన్ తో వీడియోను షేర్ చేసుకున్నారు. స్కై డైవింగ్ లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే విమానంలో చాలా ఎత్తుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆమె సహాయకుడి సహాయంతో పారాచూట్ వేసుకుని ధైర్యంగా కిందికి దూకారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే చేతి నిండా సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తెలుగులో హీరో రామ్ పొతినేని, దుల్కర్ సల్మాన్ తో సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాల కోసం భాగ్యశ్రీ బోర్సే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: