తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది హీరోయిన్లు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా మరి కొంతమంది మలయాళం, తమిళం, కన్నడ భాష సినిమాల నుంచి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి ఇవానా ఒకరు. ఇవామా లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయమైంది. ఈ భామ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో అద్భుతంగా నటించగలరు. లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమను తన వైపుకు తిప్పుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో అనేక సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది. 


భామ తెలుగులోనే కాకుండా వివిధ భాషా సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. చిన్న వయసులోనే ఈ భామ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. 12 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఇవానా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. చిన్నతనంలోనే చిత్ర పరిశ్రమకు రావడంతో ఇవానా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఎన్నో ట్రోల్స్ కు గురైంది. అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. ఎత్తు తక్కువగా ఉన్నావని, సన్నగా కట్టెపుల్లలాగా ఉన్నావని, అసలు హీరోయిన్ గా నువ్వు పనికి రావని ఎంతోమంది ఇవానాను ట్రోల్ చేశారు.


అయినప్పటికీ ఇవానా తన పని తాను చేసుకుంటూ పోయింది. తన ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచింది. అదే తనకు మంచి గుర్తింపుని ఇచ్చింది. రీసెంట్ గా ఇవానా సింగిల్ సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమానూ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో శ్రీ విష్ణు హీరోగా నటించగా.... కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా..... సింగిల్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇవానా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.


అందులో భాగంగా ఇవాళ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యాలను షేర్ చేసుకున్నారు. తనకు రొమాంటిక్ సన్నివేశాలు అసలు నచ్చవని చెప్పారు. గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్ చేయడం, రొమాంటిక్ సన్నివేశాలకు నేను చాలా దూరంగా ఉంటానని ఇవానా షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని ఇవానా తన అభిమానులకు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇవానా షేర్ చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: