టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు , దీనిని మరి కొంత కాలంలో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన తారక్ , ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆ అంచనాలకు అనుగుణం గానే ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సన్నివేశం గురించి ప్రశాంత్ నీల్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని తారక్ ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం మేకర్స్ ప్రస్తుతం ఓ అదిరిపోయే భారీ సెట్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ సెట్ లో ఒక భారీ యాక్షన్స్ సన్నివేశంతో డ్రాగన్ మూవీ లోని తారక్ ఇంట్రడక్షన్ సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రడక్షన్ సన్నివేశం లో 1000 మంది ఫైటర్స్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా డ్రాగన్ మూవీ లో తారక్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని సూపర్ సాలిడ్ రేంజ్ లో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తారక్ ప్రస్తుతం వార్ 2 అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 మూవీని మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక తారక్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీలోనూ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీలోనూ నటించడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: