తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో అక్కినేని నాగార్జున , అక్కినేని నాగ చైతన్య కూడా ఉంటారు. అక్కినేని నాగార్జున నట వారసులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే అక్కినేని నాగచైతన్య కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటీ మణులలో ఒకరు అయినటువంటి సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి వివాహ బంధం కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా ముందుకు సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.

ప్రస్తుతం ఎవరికి వారు జీవిస్తున్నారు. ఇక నాగ చైతన్య , సమంత విడిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులలో ఒకరు అయినటువంటి కొండా సురేఖ , నాగ చైతన్య , సమంత గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చాలా వైరల్ అయ్యాయి. ఇక నాగార్జున , నాగ చైతన్య కూడా వాటిపై సీరియస్ అయ్యారు. కొండా సురేఖ పై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇక నాగార్జున ఆ తర్వాత వెనక్కు తగ్గుతాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కూడా కొండా సురేఖ పై పెట్టిన కేసు విషయంలో అసలు వెనక్కు తగ్గడం లేదు. ఇక నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కూడా తాజాగా ఎందుకు పరువు నష్టం దాబా వేశారు అనే దానిపై వీరిద్దరూ తమ స్టేట్మెంట్లను కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది.

తాజాగా వీరిద్దరు కూడా ఎందుకో పరువు నష్టం దావా కేసు వేసాము అనే దానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు సమర్పించారు. ఇలా నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కూడా కొండా సురేఖ పై పెట్టిన కేసు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళుతున్నారు. మరి నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కూడా పరువు రాష్ట్రం దావా కేసును విత్ డ్రా చేసుకోన్నట్లయితే వీరికి కోర్టు నుండి ఎలాంటి తీర్పు వస్తుందా అని అనేక మంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: