పవన్ కళ్యాణ్ — ఒకప్పుడు ఈ పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది సినిమాలు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పేరు వినగానే ప్రజల మదిలో రెండు రంగాలు వెంటనే మెదులుతాయి — సినిమాలు మరియు రాజకీయాలు. సినిమా రంగంలో ఆయన సాధించిన స్థానం ఎంత గొప్పదో, రాజకీయాల్లో కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రజాదరణ సంపాదించుకున్నారు. జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసిన వ్యక్తిగా నిలిచారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆయన పాత్ర కూటమి ప్రభుత్వానికి బలమైన ఆధారంగా నిలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో "గేమ్ చేంజర్" గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన ఒకవైపు రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు సినీ కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఆయన తాజా సినిమా "ఓజీ" రిలీజ్ తరువాత ఫ్యాన్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పవన్ కళ్యాణ్, మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించుకున్నారు.

ఇంతకు ముందు ఆయన చివరి సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్" అవుతుందని, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతారని అనుకున్నారు. కానీ “ఓజీ” సినిమా చూసిన తర్వాత అభిమానులు మాత్రం అలా అనుకోవడం మానేశారు. “పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపకూడదు! ఆయన ఇంకా చేయాల్సిందే!” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల అప్‌డేట్స్ గురించి వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఆయన తాజాగా ఇద్దరు టాప్ డైరెక్టర్లతో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందులో ఒకరు ప్రముఖ తమిళ్ డైరెక్టర్, మరొకరు తెలుగు స్టార్ డైరెక్టర్ అని టాక్ వినిపిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలపై ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారు? ఇటీవల వరకూ “రాజకీయాలే నా ప్రధాన లక్ష్యం” అని స్పష్టంగా చెప్పిన పవన్ ఇప్పుడు ఎందుకు మళ్లీ సినిమా షూటింగ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు? అనే ప్రశ్న ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.ఇదంతా వెనుక ఉన్న మేథావి త్రివిక్రమ్ శ్రీనివాస్ పని అంటూ కొందర్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్‌కి త్రివిక్రమ్ అత్యంత సన్నిహిత మిత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనే పవన్ కెరీర్‌లో కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రేరణనిస్తారనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్ల మధ్య పవన్ మళ్లీ సినిమాల వైపు తిరగడానికీ, సమతౌల్యంగా రెండింటినీ కొనసాగించడానికీ త్రివిక్రమ్ ప్రభావం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ట్రెండ్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం — ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు రెండింటినీ సమానంగా కొనసాగించడం పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ జీవితానికి తీవ్ర నష్టం కలిగించవచ్చని అంటున్నారు. “త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్‌ను దెబ్బతీస్తున్నాడు” అంటూ కొందరు సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి — పవన్ కళ్యాణ్ చేసే ప్రతి నిర్ణయం సోషల్ మీడియాలో సునామీ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. సినిమా కానీ రాజకీయాలు కానీ — పవన్ కళ్యాణ్ పేరు ఉన్నచోట ఎప్పుడూ హీట్ ఉండబోతోందన్నది మాత్రం ఫ్యాన్స్‌కు బాగా తెలుసు!


మరింత సమాచారం తెలుసుకోండి: