భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడంతో భారత్ మీద అమెరికా పరోక్షంగా ఆధార పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ అమెరికా సంబంధాల మధ్య ఎన్నో అనుమానాలు వచ్చాయి.  అయితే ఇప్పుడు భారత్ ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులు అమెరికా సేవలో ఎక్కువగా ఉన్నారని అన్నారు. అదే విధంగా భారత్ నుంచి వచ్చి స్థిరపడిన వారు అమెరికాను స్వాధీనం చేసుకున్నారు అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తన టీం లో దాదాపు 55 మందికి ఆయన చోటు కల్పించారు. దీంతో ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా మోడీని ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన వైఖరిలో మార్పు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.

వ్యాక్సిన్ విషయంలో కూడా ఆయన మన మీద ఆధార పడే అవకాశాలు కనబడుతున్నాయి. యూరపియన్  యూనియన్ తో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో భారత్ కి అమెరికా కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే బిడెన్ ఓటమికి ట్రంప్ గెలుపుకి మోడీ సహకరించారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. అందుకే మోడీ విషయంలో అమెరికా సీరియస్ గా   వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. తాజా వ్యాఖ్యలతో భారత్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటుంది అనే విషయం స్పష్టంగా అర్థమైంది అంటూ కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: