ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. సీఎం జగన్ ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. మొదటిసారి సీఎంగా ఉన్న జగన్ ఎంతో అనుభవమున్న వాడిలా ప్రజల అవసరాలను ముందే గ్రహించి మానిఫెస్టోలో లేని హామీలను సైతం నెరవేర్చుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నాయకుల దృష్టి అంతా జరగబోయే మంత్రివర్గ మార్పు పైనే నెలకొంది. ముందుగానే చెప్పిన విధంగా రెండున్నరేళ్ల తరువాత మంత్రి మార్పు జరగనుంది. అయితే సమాచారం ప్రకారం డిసెంబర్ లోపు ఈ మార్పు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంత్రి పదవి దక్కిన వారిలో ఎవరెవరు తిరిగి కొనసాగనున్నారు ? ఎవరెవరు కొత్త వారు కేబినెట్ లో చోటు దక్కించుకోనున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పుడు కేబినెట్ లో కొనసాగుతున్న మహిళా మంత్రులపైన ఒక ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం మహిళా మంత్రులుగా ఉన్న ముగ్గురిలో ఇద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. వారిలో హోం మంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత జగన్ కు బాగా దగ్గరవడంతో ఈమె మంత్రిగా సేఫ్ అయినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ఇద్దరి మంత్రులపై వేటు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

డిప్యూటీ సీఎం గా ఉన్న పుష్ప శ్రీవాణి అలాగే తానేటి వనితలు ఇద్దరినీ మంత్రి పదవి నుండి తప్పిస్తారని వార్తలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వారు ఎవరు మంత్రి పదవులను దక్కించుకుంటారనే దానిపై ఆసక్తి కలుగుతోంది. మరి కొత్త మంత్రులు ఎవరో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంది. అంతే కాకుండా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా ఆశావహుల లిస్ట్ లో ఉన్నారు. మరిం జగన్ ఎప్పుడూ ఊహకందని విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని తెలిసిందే. ఈ సారి ఎటువంటి షాక్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: