కనిపించడం లేదు గాని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయం సలా సలా మసులుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ప్లాన్లు సిద్ధం చేస్తున్నాయి. అందరికన్నా ఓ అడుగు ముందుకు గానే వేసిన కమలం యూపీ టు  ఢిల్లీలో హైవే లాంటి పక్క ప్లాన్ సిద్ధం చేసింది. అదిరిపోయే నిర్ణయాలతో విపక్షాలను బెదరగొట్టే అడుగులతో కమలం పార్టీ రయ్యిమని దూసుకుపోయేలా మోడీ స్కెచ్ గీశారు. ఐదు రాష్ట్రాల  సెమీఫైనల్ కు యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? 2024 ఫైనల్ కు మాస్టర్ ప్లాన్ సిద్ధం అయిందా..? విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదంటే యూపీలో బీజేపీ విజయం సాధించి తీరాల్సిందేనా..? వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

 సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ వంటి ఎలక్షన్స్. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారన్నదానిపైనే ఢిల్లీ పీఠం ఎక్కేదెవరన్నది ఆధారపడుతుంది. అందుకే యూపీలో సీఎం సీటు నుంచి దేశానికి సీఎం సీటు వరకు బిజెపి పక్క వ్యూహాలు సిద్ధం చేసింది. కరోనా కారణమో, మరేదైనా పరిణామమో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఒకప్పటి పరిస్థితులు లేవు. వ్యతిరేకత ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పాగా వేయాలని బిజెపి కంకణం కట్టుకుంది. దీంతో యూపీలో బిపి ఓ రేంజ్ లో కనిపిస్తోంది. యూపీ తో పాటు వరుసగా మూడోసారి  కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ప్లాన్ సిద్ధం చేసింది. నిజానికి ఏ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్నా ఆ పార్టీపై వ్యతిరేకత రావడం ఖాయం. ఇప్పుడు బిజెపికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. కరోణా పరిణామాలకు తోడు పెరిగిన పెట్రో ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాలు. కేంద్రం మీద సామాన్యుడు కాస్త  కటువుగానే ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమంటే అంత ఈజీ కాదు. ఈ విషయం బిజెపి నేతలకు కూడా తెలుసు. సామాన్యుడి ఆవేదన ఆగ్రహంగా మారక ముందే పరిస్థితిని చక్కదిద్దాలంటే ఏం చేయాలన్న ఆలోచనలో నుంచి పుట్టిందే మోడీ కొత్త ప్లాన్. ఒక్కమాటలో చెప్పాలంటే మోడీ హవా తోనే బిజెపి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే మంత్రుల బృందం మాత్రం అంతలా జనాల్లోకి వెళ్లలేక పోయిందని సొంత పార్టీలోనే ఓ చర్చ ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ నేతలు కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. 77 మంది కేంద్ర మంత్రులను, 8 గ్రూపులుగా విభజించి పాలనలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేలా, జనాలకు ఇంకా చేరువయ్యేలా ప్లాన్లు వేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం, నిపుణులను ఎంపిక చేసుకొని పని చేయడం, వారికి సంబంధించిన వనరులను కేటాయించడం లాంటివి చేస్తుంటారు. ఒక్కో గ్రూపులో 9 నుంచి 10 మంది మంత్రులు ఉంటారు. ఇందులో ఒక్కరిని కోఆర్డినేటర్ గా నియమిస్తారు.

జనాల నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలుసుకొని స్పందించేందుకు  ఈ గ్రూపులో పనిచేస్తాయి. యూపీ మాత్రమే కేంద్రంలో ఎవరుండాలని డిసైడ్ చేస్తుందా అంటే కాకపోవచ్చు కానీ కచ్చితంగా కాదు అనడానికి లేదు. అందుకే యూపీని జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి . యూపీలో విజయం సాధించకపోతే విపక్షాలు బలం పుంజుకుంటాయి. అదే జరిగితే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ పీఠానికి ఎసరు పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్లాన్ యూపీ నుంచి రెడీ చేసింది బిజెపి. ఇక్కడి నుంచి గురిచేసి ఢిల్లీని మూడోసారి కొట్టాలని ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: