చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని రీతిలో చంద్ర‌బాబు భావోద్వేగంతో వ్య‌వ‌హ‌రించారు. చిన్న‌పిల్లాడిలా చేతులు అడ్గుపెట్టుకుని మ‌రి వెక్కివెక్కి ఏడ్చారు. మ‌ళ్లీ సీఎం అయిన త‌రువాత‌నే అసెంబ్లీకి వ‌స్తాన‌ని సంచ‌న‌ల ప్ర‌తిన బూనారు. చంద్ర‌బాబు ఎమోష‌న్స్ సైకిల్ పార్టీ నేత‌ల్లో ఊపు తెస్తుందా.. అసలు చంద్ర‌బాబు అంత‌లా ఎడవాల్సిన అవ‌స‌రం ఏముంది అనేది చ‌ర్చ‌గా మారింది. క‌న్నీటి వెనుక అస‌లు క‌థ ఏమిటీ.? నారా చంద్ర‌బాబు నాయుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అత్య‌ధిక సంవ‌త్స‌రాలు పాలించిన సీఎంగా అలాగే.. విభ‌జిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌కుడిగా చ‌రిత్ర సృష్టించారు.


   భావోద్వేగాలు ముఖంపై క‌నిపించ‌కుండా వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు మొదటి సారిగా ఏడ్చారు. బోరున విల‌పించారు. అంత‌కు ముందు స‌భ‌లోని భావోద్వేగానికి గుర‌యిన ఆయ‌న త‌న‌కు త‌న భార్య‌కు స‌భ‌లో అవ‌మానం ఎదురైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ నుంచి వాక్ చేస్తున్నాన‌ని ఇక సీఎం అయిన త‌రువాత‌నే అసెంబ్లీలోకి అడుగు పెడుతాన‌ని సంచ‌న‌ల శ‌పథం చేశారు. ఇది గౌర‌వ స‌భ కాద‌ని, కౌర‌వ స‌భ అంటూ భావోద్వేగానికి గుర‌య్యారు. అస‌లు ఎన్న‌డు లేని రీతిలో చంద్ర‌బాబు బోరున విల‌పించారు. దీనికి కార‌ణం రెండో రోజు స‌భ‌లో జ‌రిగిన ప‌రిణామాలే కార‌ణం.


   అంబ‌టి రాంబాబును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిన బాబు అండ్ కో మాట‌ల‌తో అంబ‌టి చంద్ర‌బాబు పై మాట‌లు విసిరారు దీంతో.. త‌న‌ను త‌న భార్య‌ను తీవ్రంగా అవ‌మానించార‌ని ఆగ్రంహం వ్య‌క్తం చేసిన బాబు.. సీఎం అయిన త‌రువాతే అసెంబ్లీలో అడుగు పెడుతాన‌ని ప్ర‌తిజ్ఞ‌బూనారు. అయితే, 2015 లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న త‌మ‌కు ప్ర‌శ్నించే హ‌క్కు లేదా అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చంద్ర‌బాబు లాగే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి వ్య‌క్తం అవుతుందా.?  టీడీపీ నేత‌ల్లో క‌సీ రేపుతుందా.?  లేదా కాల ప్ర‌వాహంలో ఇవ‌న్నీ మ‌రుగున‌ప‌డిపోతాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: