నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే...ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి గెలుపు గుర్రాలు కావాలి. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం టీడీపీ బలమైన నాయకులని నిలబెడితే గట్టి పోటీ ఉంటుంది. అంటే టీడీపీకి బలమైన నాయకులు కావాలి...యాక్టివ్ గా పనిచేసే నేతలు కావాలి. ఇప్పుడు చంద్రబాబు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పనిచేయని నాయకులని పక్కనబెట్టేస్తున్నారు...కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

అయితే ఇంకా ఎవరైతే పనిచేయరో వారిని సైడ్ చేసేస్తానని చంద్రబాబు మొహమాటం లేకుండా చెబుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లోపు ఎవరైనా పికప్ అవ్వకపోతే వారిని పక్కనబెట్టేస్తానని చెబుతున్నారు. అంటే దీని బట్టి చూస్తే పలు సీట్లలో మార్పులు మాత్రం జరిగేలా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సైకిల్ సీట్లు మారేలా ఉన్నాయి.

కొందరు నాయకులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అలా సీట్లు కోల్పోయే వాళ్ళు పలువురు ఉన్నారు. ముఖ్యంగా గుడివాడలో మళ్ళీ రావి వెంకటేశ్వరరావుకు సీటు ఇస్తారా? లేదా? అనేది డౌట్. ఎందుకంటే రావి ఇంచార్జ్‌గా ఉన్నా సరే పెద్దగా బయటకొచ్చి పనిచేయడంలేదు.  పైగా అక్కడ కొడాలి నాని స్ట్రాంగ్ గా ఉన్నారు.  కాబట్టి కొడాలిని ఎదురుకోవాలంటే రావి బలం సరిపోదు.

ఇటు కైకలూరు విషయానికొస్తే...జయమంగళ వెంకటరమణ పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. ఆయనకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉంది. ఇక విజయవాడ వెస్ట్ సీటు విషయంలో క్లారిటీ లేదు. జలీల్ ఖాన్ ఉన్నా సరే...ఆయన దూకుడుగా పనిచేయడం లేదు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఈయనకు నెక్స్ట్ సీటు ఇవ్వడం డౌటే. తిరువూరు లో ఇంచార్జ్ శావల దేవదత్‌కు...నెక్స్ట్ సీటు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. ఇలా కృష్ణా జిల్లాల్లో కొందరు తెలుగు తమ్ముళ్ళ సీట్లు చిరిగేలా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: