పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కాపులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీనే పశ్చిమ గోదావరిలో సత్తా చాటుతుంది. 2014లో పశ్చిమ గోదావరిలో కాపులు టీడీపీ వైపు మొగ్గు చూపారు. పవన్ సపోర్ట్ ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీ వైపు చూశారు. దీంతో జిల్లాలో వైసీపీ హవా నడిచింది. పైగా ఈ సారి జనసేన విడిగా పోటీ చేయడం వల్ల కాపులు ఓట్లు అటు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్ జరిగింది.

ఇక ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఐదుగురు కాపు ఎమ్మెల్యేలు గెలిచారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, ఏలూరులో ఆళ్ళ నాని, నిడదవోలులో శ్రీనివాస్ నాయుడు, ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణలు గెలిచారు. ఇందులో గ్రంథి ఏకంగా పవన్ కల్యాణ్‌పైనే గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు దాటేశాయి. మరి ఈ రెండున్నర ఏళ్లలో ఈ కాపు ఎమ్మెల్యేల బాగానే పనిచేశారా? ప్రజలకు బాగానే అందుబాటులోనే ఉన్నారా? అంటే చెప్పడం కష్టమే...కాపు ఎమ్మెల్యేలు పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయలేదనే చెప్పొచ్చు.

కొంతవరకు గ్రంథి శ్రీనివాస్‌కు మంచి మార్కులు పడుతున్నాయి గానీ...మిగిలిన వారికి అంతగా మంచి మార్కులు పడటం లేదు. మంత్రిగా ఉన్న ఆళ్ళ నానిపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు పలు సర్వేలు వస్తున్నాయి. ఆయన మంత్రిగా కూడా సరైన పనితీరు కనబర్చడంలో విఫలమైనట్లు కనిపిస్తున్నారు.

 
అటు నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబులపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా వీరికి ధీటుగా టీడీపీ నేతలు కూడా పుంజుకుంటున్నారు. ఇక ఎక్కువగా ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ...ఈయన పనితీరుపై తాడేపల్లిగూడెం ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయితే నెక్స్ట్ గానీ టీడీపీతో పవన్ కల్యాణ్ కలిస్తే ఈ కాపు ఎమ్మెల్యేలకు చెక్ పడిపోతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: