ఏపీ రాజకీయాల్లో ఒకే ఫ్యామిలీ నుంచి రాజకీయాలు చేసే నాయకులు చాలామంది ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నవారు ఉన్నారు. వైసీపీ కావొచ్చు...అటు టీడీపీలో కావొచ్చు పలు ఫ్యామిలీలు రాజకీయం చేస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లా వైసీపీలో మేకపాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముందు నుంచి వైఎస్సార్ ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటూ వస్తున్న మేకపాటి ఫ్యామిలీ...నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉంది.


మొదట నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి..వైఎస్సార్‌కు అండగా ఉంటూ వచ్చారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండగా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. అలాగే ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో పనిచేశారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు జగన్ కోసం పదవులకు రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వచ్చి మళ్ళీ ఆ పార్టీ నుంచి గెలిచారు. రాజమోహన్ నెల్లూరు ఎంపీగా, చంద్రశేఖర్ ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు.


అయితే 2014 ఎన్నికల్లో రాజమోహన్ మళ్ళీ ఎంపీగా గెలవగా, చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో రాజమోహన్ తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ఫ్యామిలీలు ముగ్గురు వైసీపీకి కీలకంగా మారారు. అయితే 2019 ఎన్నికల్లో రాజమోహన్ రాజకీయాల నుంచి సైడ్ అయ్యారు. ఇక చంద్రశేఖర్..ఉదయగిరి నుంచి పోటీ చేసి గెలవగా, గౌతమ్...ఆత్మకూరు నుంచి పోటీ చేసి మళ్ళీ గెలిచారు. అలాగే గౌతమ్‌కు జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం వచ్చింది.


ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో అటు గౌతమ్, ఇటు చంద్రశేఖర్‌లు తిరుగులేని నేతలుగా ఉన్నారు. ఇక వీరికి చెక్ పెట్టడానికి టీడీపీ కొత్త వ్యూహాలు వేస్తూ వస్తుంది. ఇటు ఉదయగిరిలో టీడీపీ నేత బొలినేని రామారావు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అటు ఆత్మకూరులో గౌతమ్‌కు ధీటైన అభ్యర్దిని పెట్టాలని కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా ఈ బాబాయి-అబ్బాయికి చెక్ పెట్టేయాలని టీడీపీ గట్టిగా ట్రై చేస్తుంది. మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: