జిల్లా నేతల నుండి వస్తున్న సమాచారం ప్రకారమైతే ఇదే వాస్తవం. వచ్చే ఎన్నికల్లో తాను ఆళ్ళగడ్డ నుండి కాకుండా నంద్యాల నియోజకవర్గం నుండి పోటీచేయాలని భూమా అఖిలప్రియ డిసైడ్ అయ్యారట. డిసైడ్ అయ్యారంటే చంద్రబాబునాయుడు ఆమెకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు కాదు. అయితే వచ్చే ఎన్నికల్లోగా ఆమెచేసే కంపు అంతా ఇంతగా ఉండదు. ఎందుకంటే అసలే భూమా అఖిలప్రియంటే నేతల్లో ఎవరికీ మంచి అభిప్రాయంలేదు. ఆమెకు చాలామంది నేతలతో ఏమాత్రం పడదు.





అనేక కారణాల వల్ల చాలామంది నేతలు అఖిలకు దూరంగా ఉంటారు. మొన్నటివరకు పోటీచేసిన ఆళ్ళగడ్డలోనే ఆమెకు చాలామంది నేతలు దూరమైపోయారు. అలాంటిది కొత్తగా నంద్యాలలో పోటీచేయటానికి ఆమె ప్రయత్నాలు మొదలయ్యాయంటే కంపు మామూలుగా ఉండదు. ఎందుకంటే నంద్యాల నుండి సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డి అండ్ అదర్స్ టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.





ఈ నేపధ్యంలో కొత్తగా అఖిల వచ్చి దూరటమంటే పార్టీలో గందరగోళం సృష్టించటం కాక మరేమిటి ? అసలు ఆళ్ళగడ్డ నుండి అఖిల ఎందుకు దూరం జరగాలని అనుకుంటున్నారో, నంద్యాలలో పోటీచేయాలని అనుకోవటానికి కారణాలు ఏమిటో ఎవరికీ తెలీదు. ఆమెకు చంద్రబాబు, లోకేష్ తో సరైన సంబంధాలు లేవనే ప్రచారం అందరికీ తెలిసిందే.






అఖిల చాలాకాలంగా పార్టీలో కన్నా వివాదాల్లోనే ఎక్కువగా కనబడుతున్నారు. దాంతో చాలామంది ఆమెకు దూరంగా ఉంటున్నారట. హత్యకు కుట్ర, పోర్జరీ, మోసాలు, కిడ్నాపులు, దాడుల్లాంటి కేసులు అఖిల మీదున్నాయి. ఇందుకనే ఈ మాజీమంత్రితో మాట్లాడేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటంలేదట. మరీ నేపధ్యంలో ఆళ్ళగడ్డలో టికెట్టే ఖాయంలేదు. అలాంటిది తనంతట తానుగా నంద్యాల నుండి పోటీచేయాలని డిసైడ్ అయితే చెల్లుబాటవుతుందా ? మొత్తానికి పై రెండు నియోజకవర్గాల్లో అఖిల కారణంగా పెద్ద తలనొప్పి తప్పేట్లు లేదు.


 


ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ళగడ్డ కాకుండా వచ్చే ఎన్నికల్లో

మరింత సమాచారం తెలుసుకోండి: