పాపం అబ్బాయికి టైం ఉంది.  కాసేపు ఆలా ఆన్లైన్ లో కాలక్షేపం చేద్దాం అనుకున్నాడు. అలా కాలక్షేపం చేస్తున్న సమయం ఓ మంచి అమ్మాయి ఫోటో కనిపించింది. ఆ ఫోటో పూర్వతరాలు ఆరా తీస్తే ఆ అమ్మాయి ఫేసుబుక్ ఐడి కనిపించింది. రిక్వెస్ట్ పెట్టాడు ఆ అమ్మాయి కూడా ఫేసుబుక్ లో రిక్వెస్ట్ యాక్సప్ట్ చేసేసింది.                                                                  


ఇంకేముంది .. అబ్బాయి అమ్మాయి విచ్చలవిడిగా చాటింగ్ చేసుకున్నారు. కట్ చేస్తే ప్రేమ లో పడ్డారు. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక రోజు అమ్మయి ఇంట్లో ఎవరు లేరు. దీంతో ఆ అమ్మాయి ''ఇంట్లో ఎవరు లేరు .. ఇంటికి రా'' అంది. పాపం అబ్బాయి సంబరపడుతూ వెళ్ళాడు.                                                                          


కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళగానే పెద్దలు పెళ్లి చేసేశారు. ఏంటి అని అనుకోకండి. ఈ ఘటన ఓడిశాలో జరిగింది. అబ్బాయి కరెక్ట్ గా ఇంటికి వెళ్లే సమయంలో ఊర్లో ఉండే పక్కింటి వారు ఆ అబ్బాయిని చూశారు. చుసిన వారు ఊరికే ఉంటారా. అమ్మయి తల్లికి చెప్పారు. ఊరంతా కలిసి అబ్బాయిని, అమ్మాయిని మీది నిజమైన ప్రేమ అయితే వెంటనే పెళ్లిచేసుకోండి అంటూ బలవంతం చేశారు. ఇద్దరు చేసేది ఏమి లేఖ పెళ్లి చేసుకున్నారు ఆ ఆన్లైన్ ప్రేమికులు. కథ సుఖాంతం అయ్యింది. దీంతో ఈ పెళ్లి ప్రస్తుతం వాళ్ళు ప్రేమించుకున్న వేధిక సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంది.                                                          


మరింత సమాచారం తెలుసుకోండి: