ఎక్కడ ఉన్నత పదవుల కోసం ఎంపర్లాడటం సహజం. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సీన్ చూస్తే అందుకు భిన్నంగా కనబడుతుంది. ఏ ఉద్యోగి అయిన సరే కీలకమైన పోస్ట్ ఉంది చక్రం తిప్పాలనుకుంటారు. దానికి విరుద్ధంగా ఇక్కడ కొనసాగుతుంది. ఇక ముందు సమీప భవిష్యత్తులో కూడా మాకు సిఎస్‌ పోస్టు వద్దు.. శాఖాదిపతులుగా కొనసాగటమే మాకు ముద్దు అని కొందరు సీనియర్‌ ఐఎఎస్‌లు తమ సన్నిహితులతో చెబుతున్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పదవికి స్వేచ్చ, అధికారాలు లేవని సీనియర్‌ ఐఎఎస్‌ల నమ్మకం.

తాజాగా ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సహానికి ఎదురు అవుతోన్న పరిణామాలను చూస్తున్న కొందరు సీనియర్‌ ఐఎఎస్‌లు ఆమెను ఏపికి రావద్దని మేము ముందుగానే చెప్పాం. ఆమె ఎవరి మాట వినలేదు।. ఎవరెవరిని గుడ్డిగా నమ్మి ఇక్కడికి వచ్చారో కానీ అందుకు ఫలితం అనుభవిస్తున్నారని గతంలో ఆమె కింద పనిచేసిన ఐఎఎస్‌లు కొందరు ఆవేదనతో చెబుతూ ఆమెకు సానుభూతి తెలుపుతున్నారట.


ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సహాని వ్యక్తి గత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళితే.. ఆపదవికి అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు కానీ, లేదా పదవిలో చేరేందుకు కానీ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదట. ఇప్పటికే కేంద్రం నుండి రాష్ట్ర సర్వీసులకు ఎందుకు వచ్చానా అని నీలం సహాని బాధ పడుతున్నారట. అలాంటి పరిస్థితి మాకొద్దు అని అనేక మంది సీనియర్‌ ఐఎఎస్‌లు తమ సన్నిహితులతో, ఇతర అధికారులతో చెబుతున్నారట.

నీలం సహానీ పరిస్థితి ఎలా ఉంటుందో బయట పడితే కానీ (కోర్టు ఆదేశాలు దిక్కరించినందుకు ఎలాంటి చేదు ఫలితం ఆమెకు ఎదురు కాబోతుందో) తెలియదు. ముందుగానే కొంతమంది సీనియర్‌ ఐఎఎస్‌లు వ్యక్తిగత కారణాలు, లేదా అనారోగ్య కారణాలు చూపి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: