మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్రంగా బయటపడిన  ఇఎస్ఐ స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అచ్చెన్న కార్మికశాఖ మంత్రిగా ఉన్న కాలంలో  నిబంధనలను విరుద్ధంగా  అడ్డుగోలు అవినీతికి పాల్పడ్డారనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు. అయితే దీనిపై వివరణ ఇచ్చుకోకుండా సామాజికవర్గాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇందులో ప్రధానంగా నారా లోకేష్ ట్వట్టర్ లో చేస్తున్న ట్వీట్లు మరీ విచిత్రంగా ఉంటోంది.

 

వైసిపి ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేస్తోందట. బిసిలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందిన బిసి సామాజికవర్గం నేత అచ్చెన్నాయుడు నిలదీస్తున్నందకు అక్రమ కేసులు పెడుతోందంటూ లోకేష్ ట్వీట్ చేయటమే విచిత్రంగా ఉంది. ఎలాగైనా బిసి నేతైన  అచ్చెన్నకు అవినీతి మరక అంటించాలన్న కుట్రతోనే వైసిపి ప్రభుత్వం ఇఎస్ఐ స్కాం అంటూ హడావుడి చేస్తోందంటూ మదలగిరి మండిపోయాడు.

అచ్చెన్న హయాంలో స్కాం జరిగిందా లేదా ? అవినీతికి పాల్పడ్డాడా లేదా అన్న విషయంపై వివరణ ఇవ్వకుండా సామాజికవర్గాలను ఎందుకు తెరమీదకు తెస్తున్నాడు లోకేష్ ? అంటే బిసి సామాజికవర్గానికి చెందిన నేతైతే అవినీతికి పాల్పడచ్చా ? ఎంత అవినీతికి పాల్పడినా సామాజికవర్గాన్ని తెరపైకి తెచ్చుకుంటే సరిపోతుందన్నట్లుగా ఉంది మందలగిరి వ్యాఖ్యలు.

 

రాజకీయాలను సామాజికవర్గాల వారీగా అయ్య విడకొట్టి సమాజాన్ని నాశనం చేశాడు. ఇపుడు కొడుకు కూడా అదే దారిలో నడుస్తున్నాడు. తండ్రి సిఎంగా ఉన్న రోజుల్లో కూడా  నేరుగా ఎంఎల్ఏగా పోటి చేసే ధైర్యం  చేయలేక దొడ్డిదోవలో ఎంఎల్సీ అయిపోయి మంత్రైన  సాహసవంతుడు లోకేష్. అలాంటిది సామాజికవర్గాలను కూడా తమకు రక్షగా తెచ్చుకుంటున్నట్లే ఉంది చూస్తుంటే.

 

అచ్చెన్న గురించి చెబుతూ పదే పదే బిసి సామాజికవర్గంపై తుగ్లక్ ముఖ్యమంత్రి పడ్డాడని ఎద్దేవా చేస్తున్న లోకేష్ సామాజికవర్గాలకు ఏ విధమైన మెసేజ్ పంపాలని అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.  ఇపుడు పదే పదే చెబుతున్న బిసి సామాజికివర్గమే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి దూరమైన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే దూరమైన బిసిలను మళ్ళీ దగ్గర చేసుకోవాలన్న ఆలోచనతోనే బిసిల మంత్రం జపిస్తున్నట్లు అనిపిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: