తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు సతీమణి, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మి పార్వతి జోస్యం ఫలించేనా ?, నిజంగానే ఏపీకి చెందిన ముగ్గురు నాయుళ్లు ...  త్వరలోనే జైలుకు వెళ్లనున్నారా?? అన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది . గత ఐదేళ్లలో చంద్రబాబు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని , ఆ అవినీతి బండారం త్వరలోనే బయటపడనుందని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన లక్ష్మి పార్వతి సహజంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో  పెద్ద ఆశ్చర్యమేమీ లేదు .

 

చంద్రబాబు అంటే మొదటి నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఉండనే ఉంది . దానికితోడు చంద్రబాబు అవినీతి పై ఆమె కోర్టులను కూడా ఆశ్రయించారు . అయితే చంద్రబాబు తో కలిసి మరో ఇద్దరు నాయుళ్లు కూడా జైలుకు వెళ్లనున్నారని లక్ష్మి పార్వతి చేసిన నర్మగర్భ వ్యాఖ్యలిప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి . ఆ ఇద్దరు నాయుళ్లు ... మాజీ మంత్రి అచ్చెన్నాయుడు , కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిలన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు . చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాల కారణంగా చంద్రబాబు  , ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డ సుజనా చౌదరి , ఈ ఎస్ ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడులు జైలుకు వెళితే చూడాలని ఉందన్న లక్ష్మి పార్వతి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి మరి .

 

శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల కారణంగా    చంద్రబాబు జైలుకు వెళ్లే అవకాశాలు ఎంతమాత్రం కన్పించకపోగా, ఇక సుజనా ఆర్ధిక అవకతవకల కారణంగా జైలుకు వెలుతారా? లేదా ?? అన్నది కాలమే నిర్ణయిస్తుంది . ఇకపోతే ఈ ఎస్ ఐ కుంభకోణం లో  అచ్చెన్నాయుడు ప్రమేయం ఎంత అన్నదానిపై ఆధారాలు లభించాల్సి ఉంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: