మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి గద్దె దించడానికి రంగం సిద్ధమైంది. గత ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే కాంగ్రెస్ పుట్ట ముంచేలాంటి పథకం మరొకటి రచించినట్లు కనిపిస్తుంది. కర్ణాటక తరహా రాజకీయాలకు మధ్యప్రదేశ్ లో బీజేపీ తెరతీసింది. కాసేపటి క్రితం ప్రధాని మోదీతో సింధియా భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరుండి ఆయనను మోదీ వద్దకు తీసుకెళ్లారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజే బీజేపీలో సింధియా చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

 

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింథియా అనూహ్యంగా బీజేపీలో చేరడానికి కారణమేంటి .. అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే దీని వెనుక ఓ మహిళా బీజేపీ నేత వ్యూహం ఉందని చర్చలు నడుస్తున్నాయి.  రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింథియా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 45 రోజులుగా ఆమె పలుమార్లు సింథియాతో సమావేశమై చర్చలు జరిపినట్లు సమాచారం. చివరకు బీజేపీలో చేరేందుకు సింథియాను ఒప్పించినట్లు తెలుస్తోంది.

 

ఈ లెక్కన  కమల్‌నాథ్‌ సర్కార్‌కు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది.  కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇక పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సింధియా తన రాజీనామా లేఖను పంపిన నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరోవైపు, ఏ క్షణమైనా ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే కమల్‌నాథ్‌ సర్కార్‌ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: