ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో ఎప్పటినుండో పార్టీ కోసం పని చేసిన నాయకులు వైసిపి పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ అసహనం చెందుతున్నారు. గత ఎన్నికలలో వారితోనే పోరాడి ప్రస్తుతం మళ్లీ వారిని మన పార్టీలోకి తీసుకోవటం సరైన పద్ధతి కాదని కామెంట్లు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో అధికారం వాళ్ళ చేతిలో ఉన్న తరుణంలో వాళ్ల చేత అనేక దాడులు మరియు కేసులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకు రావడం జరిగింది. అలాంటి వారిని మళ్లీ మన పార్టీలోకి తీసుకోవటం నిజంగా దారుణమని వైసీపీ కార్యకర్తలు కింద ఉన్న క్యాడర్ తాజాగా పార్టీలో చేరుతున్న వారి పట్ల మండిపడుతున్నారు.

 

సరిగ్గా చీరాల నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితులే  ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం చేతిలో చీరాల వైసీపీ క్యాడర్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ మరియు ఆయన వర్గీయులు పార్టీ కోసం తీవ్రంగా కష్టపడరు. అటువంటి టైమ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమంచి వైద్యులపై మనుషుల పై అక్రమ కేసులు మరియు దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి మనుషులను అనగా కరణం బలరాం లాంటి మనుషులను జగన్ దగ్గరికి చేర్చుకోవడం పట్ల చీరాల నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ పార్టీ అధిష్టానం పట్ల అసహనం చెందుతుంది.

 

వాళ్ల చేతుల్లో దెబ్బలు తిని ఇప్పుడు వాళ్ళకి దండ వేయటం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ఇటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల రెండు వర్గాలుగా వైసీపీ పార్టీ నాయకులు విడిపోతున్నారు. దీంతో ఒక పక్క రాష్ట్రంలో మంచి సంక్షేమం జరుగుతున్న తరుణంలో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకుంటే ఎన్నికల్లో అన్నీ సీట్లూ జగన్ కే వస్తాయని లేకపోతే పార్టీ కొన్ని సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: