ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న భారతదేశంలో కూడా వేగంగా సంక్రమిస్తుంది. ఇప్పటికే ముగ్గురికి ఈ వైరస్ సోకి చనిపోగా మొత్తం 147 కరోనా కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. తాజాగా లఢక్ స్కాట్స్ లో పనిచేసే ఒక 34 ఏళ్ల భారత జవానుకి కూడా కరోనా వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు. లఢక్ లోని ఎస్.ఎన్.ఎమ్ హాస్పటల్ లో తొలిసారిగా కరోనా వైరస్ సోకిన భారత సైనికుడికి ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు వైద్యులు.



పూర్తి వివరాలు తెలుసుకుంటే... 34 ఏళ్ల ఆర్మీ జవాన్ తండ్రి కొన్ని రోజుల పాటు ఇటలీలో ఉండి ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఐతే కరోనా పీడిత ప్రాంతమైన ఇటలీ నుండి వచ్చిన జవాన్ తండ్రి ని ఫిబ్రవరి 29వ తేదీన అధికారులు క్వారంటైన్ కేంద్రంలో ఉంచి అతనికి టెస్టులు చేసి కరోనా వైరస్ ఉందని మార్చి ఆరవ తేదీన నిర్ధారించారు. మరోవైపు ఆర్మీ జవాన్ ఫిబ్రవరి 25 నుండి మార్చి 1 వరకు సెలవు తీసుకొని ఇంటి దగ్గరే ఉన్నాడు. అనంతరం మార్చి 2వ తేదీన విధులలో చేరాడు. కానీ తన తండ్రిని క్వారంటైన్ కేంద్రంలో ఉంచడంతో అడపాదడపా ఇంటికి వస్తూ తన కుటుంబ సభ్యులు బాగోగులను చూసుకుంటూ తన తండ్రిని కూడా పలుమార్లు కలిసి వచ్చాడు.





ఐతే ఆల్రెడీ కరోనా వైరస్ ఉన్న తన తండ్రికి జవాన్ కాంట్రాక్ట్ అవ్వడం వలన అతనికి కూడా కరోనా వైరస్ సంక్రమించింది. వైద్యాధికారులు కూడా జవాన్ తరచూ తన తండ్రిని కలుస్తుండటంతో అతనికి కూడా కరోనా వైరస్ సోకిందేమోనని మార్చి 7న క్వారంటైన్ కేంద్రంలో ఉంచి టెస్టులు చేయగా మార్చి 16వ తేదీన అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అలాగే ఆర్మీ జవాను తల్లిని చెల్లిని కూడా క్వారంటైన్ కేంద్రంలో ఉంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: