ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది కరోనా వైరస్.  అయితే ఈ కరోనా వైరస్ అతి శీతల ప్రాంతాల్లో విస్తుందని..దగ్గు, తుమ్ము, జ్వరం  తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తో మనిషి చనిపోతారని అంటున్నారు.  తాజాగా కరోనా మరో లక్షణం ఉందని అంటున్నారు.  కళ్ల కలక... ప్రతి సంవత్సరమూ సీజనల్ వ్యాధి. ఓ రకమైన వైరస్ కారణంగా వ్యాపించే ఈ వ్యాధి, కొన్ని రోజుల తరువాత వెళ్లిపోతుంది. ఇక కళ్ల కలకతో పాటు జ్వరం కూడా ఉంటే, 90 శాతం వరకూ కరోనా సోకే అవకాశాలు ఉన్నట్టేనని హైదరాబాద్ లోని సరోజినీ దేవి నేత్ర వైద్యశాల నిపుణులు వ్యాఖ్యానించారు. 

 

ఆసుపత్రిలో కళ్ల కలకతో వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గతంలో మాదిరిగా కళ్ల కలక వస్తే, కొద్ది రోజుల తరువాత తగ్గిపోతుందన్న నమ్మకంతో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని అంటున్నారు.  ఇక కరోనా వైరస్ శరీరంలో ఉన్నా, ఎటువంటి లక్షణాలూ కనిపించవని చెబుతున్న వైద్యులు, జ్వరం, కళ్ల కలక ఉంటే, వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

 

ప్రస్తుతం 145 మంది సరోజినీ దేవి ఐ హాస్పిటల్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారు.  ఇప్పటికే ఆసుపత్రిలో కళ్ల కలకతో వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గతంలో మాదిరిగా కళ్ల కలక వస్తే, కొద్ది రోజుల తరువాత తగ్గిపోతుందన్న నమ్మకంతో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని అంటున్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: