కరోనా మహమ్మారిపై మోదీ సర్కార్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ పొడిగించి కఠినంగా అమలు చేస్తున్నారు. అటు లాక్ డౌన్ వల్ల పేద ప్రజకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతూ, కరోనాపై పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఇంకా మోదీ ముందడుగు వేసి, దేశంలో విపక్ష పార్టీల నేతలతో సైతం మాట్లాడుతూ, కరోనాని కట్టడి చేసేందుకు సలహాలు తీసుకుంటున్నారు.

 

ఇక విపక్ష నేతలు సైతం మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మోదీ ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి, మంచి నాయకుడు అనిపించుకున్నాడు. ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇస్తూనే,  కరోనా మహమ్మారిపై అన్ని రాజకీయ పార్టీలూ కలిసి కట్టుగా పోరాటం చేయాలని, తాను ఎంత మాత్రమూ విమర్శలు చేయడం లేదని, ప్రభుత్వానికి కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని చెప్పారు.

 

అలా రాహుల్ గాంధీ మాట్లాడటంపై ప్రసంశలు వస్తున్నాయి. విపత్కర సమయంలో కరెక్ట్ గా మాట్లాడారని అంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ ఓ అడుగు ముందుకేసి.. కరోనా మహమ్మారిపై మరింత యుద్ధం చేయడానికి రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఓసారి ప్రత్యక్షంగా కలుసుకుని ముఖాముఖిగా చర్చిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

 

ఇక రాహుల్ గాంధీ ఛరిష్మా దెబ్బతినడం వల్లే బీజేపీ వరుసగా సక్సెస్ అవుతూ వస్తోందని, అది నేటికీ కొనసాగుతోందని, కానీ నేడు మాత్రం రాహుల్‌ను అభినందిస్తున్నామని పేర్కొంది. అయితే శివసేన చెప్పిన అభిప్రాయాన్నే పలువురు రాజకీయ విశ్లేషుకులు కూడా చెబుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఇద్దరు కలిసి అభిప్రాయాలు పంచుకుంటే మరింతగా ఉపయోగపడుతుందని, ప్రజలు కూడా దీన్ని హర్షిస్తారని అంటున్నారు. మరి చూడాలి శివసేన కోరిక ఎంత మాత్రం నెరవేరుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: