చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచంలోని దేశాలన్నింటికి పాకిపోయింది.  ఎక్కడ మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  చిన్న దేశాలే కాదు అమెరికా లాంటి అగ్రదేశాన్ని కూడా వణికిస్తుంది.  ఇప్పటికే కరోనా వల్ల రెండు లక్షలకు పైగా మరణాలు సంబవించాయి.  ఇందులో నాలోగో వంతు అమెరికాలోనే మరణాలు సంబవించాయంటే అక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించొచ్చు.  ఆ తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా ఉంది.  అయితే కరోనా లక్షణాలు అంత సులభంగా బయట పడకపోవడం మరో తలనొప్పిగా మారింది.  అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఒక్కసారే కోవిడ్ 19 భారిన పడిపోతున్నారు.  

 

తాజాగా  కొంత మందికి కరోనా లక్షణాలు కన్పిస్తే… మరికొందరిని ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా కబలించేస్తోంది. ఆ మహమ్మారిని గుర్తించడానికి మరో ఆరు కొత్త లక్షణాలను  అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ డాక్టర్లు వెల్లడించారు.  సాధారణంగా కరోనా గాల్లో విస్తరిస్తుంది.. ఈ నేపథ్యంలో మనుషులు సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం. అలాగే మాస్క్ ధరించడం వల్ల మనం పీల్చుకునే గాలి ద్వారా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అయితే కరోనా వచ్చిందని తెలుసుకోవడానికి  1. చలిగా అనిపించడం, 2. వణుకు, 3. కండరాల నొప్పి, 4. తలనొప్పి, 5. వాసన గుర్తించకపోవడం, 6. గొంతు నొప్పి, మంట వీటిలో ఏ లక్షణాలు మీకు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

 

ఈ లక్షణాలు 2 రోజుల నుంచి 14 రోజుల లోపు బయటపడే అవకాశముందని సిడిసి వెల్లడించింది. కరోనా వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయన్న దానిపై ‘స్టాన్ ఫర్డ్ వర్సిటీ’కి చెందిన వైద్య బృందం సిడిసి తరుపున సర్వే చేసింది. ఇందులో కరోనా పాజిటివ్ అని తేలకముందు ఇలాంటి లక్షణాలు బయటపడ్డాయని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: