తాజాగా తెలంగాణ సర్కారు చేసిన ఓ ప్రకటన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గుండెళ్లో పరుగెత్తిస్తుండొచ్చు. అంటే.. ఇదేదో రాజకీయపరమైన ప్రకటన కాదండోయ్.. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. మరి తెలంగాణ ప్రకటనతో చంద్రబాబుకు వచ్చే చిక్కేమిటి అంటారా.. ఎందుకంటే చంద్రబాబుకు రాజకీయాలతో పాటు హెరిటేజ్ అనే ఓ పాల కంపెనీ కూడా ఉంది కదా.. ఇప్పుడు దానికి తెలంగాణలో పోటీ వచ్చేసింది.

 

 

ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే 240 కోట్ల రూపాయల వ్యయంతో ఓ మెగా పాల డెయిరీ నిర్మించబోతోంది. ఈ మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీని ఉపయోగించాలని పశుసంవర్ధక మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా అధికారులను ఆదేశించారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాలలో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. రోజురోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అద్బుతమైన ప్యాకింగ్,మరింత నాణ్యమైన ఉత్పత్తులతో ప్రజలను ఆకర్షించాలని మంత్రి వివరించారు.

 

 

 

అదేవిధంగా డెయిరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కూడా అవసరమైన చర్యలను తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రానున్న 2 సంవత్సరాలలో విజయ ఉత్పత్తులు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ,కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో విజయ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగించేలా ప్రభుత్వం నుంచి త్వరలోనే ఆదేశాలు జారీ చేయిస్తానని మంత్రి తెలిపారు.

 

 

మరి ఈ స్థాయిలో తెలంగాణ సర్కారు విజయ పాలడైయిరీని ప్రోత్సహిస్తే.. అదే వ్యాపారంలో ఉన్న చంద్రబాబు హెరిటేజ్ కంపెనీకి పెద్ద దెబ్బే అంటున్నారు మార్కెట్ నిపుణులు. హెరిటేజ్ కంపెనీకి ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున కర్మాగారాలు, వ్యవస్థ ఉన్నాయి. మరి దీనికి తెలంగాణ కొత్త డెయిరీ ఏమేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: