దేశంలో కరోనా మహమ్మారిని తరిమి కట్టేందుకు మార్చి నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచి జనసందోహంగా ఉన్న ప్రదేశాలు పూర్తిగా మూత పడ్డాయి. అందులో మద్యం షాపులు ఒకటి.. దాంతో మద్యం ప్రియులు నానా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 40 రోజుల తర్వాత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులు తెరవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దాంతో అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడం మొదలు పెట్టారు.  ఇందులో భాగంగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో మందుబాబులు సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఓ మద్యం షాపు ముందు మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఈ బారు ఏకంగా మూడు కిలోమీటర్ల మేరకు కొనసాగింది.

 

ఈ తరహా క్యూ ఓ మద్యం దుకాణం ఎదుట ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇది గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. లాక్ డౌన్ లో ఇన్నాళ్లూ మగ్గిపోయిన మందుబాబులు మద్యం అమ్మకాలపై ఆంక్షలు సడలించడంతో ఒక్కసారిగా రోడ్లపై పడ్డారు. దాని ఫలితమే మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు తయారవుతున్నాయి తమిళనాడులోని కడలూరులో ఓ మద్యం దుకాణం ముందు క్యూలైన్ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించింది.   వైన్‌షాపు ముందు మందుబాబుల క్యూ 3 కి.మీ. పొడ‌వుతో రికార్డు సృష్టించింది.

 

ప్ర‌పంచంలో మ‌రే మ‌ద్యం దుకాణం ముందు ఇంత పొడ‌వైన క్యూ ఇప్ప‌టివ‌ర‌కు లేక‌పోవ‌డం విశేషం. మామూలుగా వంద మంది నిలబడితేనే ఎప్పుడు మన వరకు వస్తుందో అన్న టెన్షన్ ఉంటుంది.. కానీ ఇక్కడ మందు బాబులు ఎంతో ఓపికతో ఏకంగా మూడు కిలో మీటర్లు నిలబడి మద్యం కోసం వెయిట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కట్టడి చేయడం రికార్డు స్థాయిలో మందుబాబులు లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని కడలూరులోని ఓ వైన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: