నిజానికి కొన్ని ఆచారాలు చూస్తే నమ్మశక్యంగా ఉండదు. అలాగే కొన్ని ఆచారాలు చూస్తే బాబోయ్ ఇలాంటి ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి అని ముక్కున వేలేసుకుంటారు. అయితే మరికొన్ని మనకెందుకులే ఇలాంటి ఆచారాలు లేవు అని బాధపడే సంఘటనలు కూడా ఉంటాయి. అయితే ఇదే కోవలోకి ఒక ఆచారం వింతగా అనిపిస్తోంది. ఇప్పుడు మనం చదవబోయే ఆచారం కూడా అలాంటిదే మరి. మరెందుకు ఆలస్యం అసలు ఏమిటో చూద్దామా.... !


మన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో బార్మర్ జిల్లాలో దెరసర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కేవలం 600 మంది మాత్రమే నివసిస్తారు. అయితే ఈ ఊరిలో ఒక వింత ఆచారం కొనసాగుతోంది. అదేమిటంటే ఆ ఊళ్లోని ప్రతి వ్యక్తికి ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే. అయితే ఇది ఇప్పుడు పెట్టుకున్న ఆచారం కాదండి... ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అట. ఆ ఊరి ఆచారాన్ని ఆ వూరు గ్రామస్తులు కచ్చితంగా పాటించాల్సిందేనట. అయితే ఎందుకు కచ్చితంగా పాటించాలి అని అనుకుంటున్నారా..? ఇక అది కూడా చూద్దాం మరి. అయితే ఈ ఊరికి చెందిన ఏ వ్యక్తి అయినా సరే ముందుగా ఒక పెళ్లి చేసుకుంటాడు. 


ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ, ఆ మొదటి భార్యకు మాత్రం పిల్లలు పుట్టరట. దీనితో అతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలట. రెండో పెళ్లి చేసుకున్న మహిళలకు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట. ఇదంతా నమ్మడానికి నమ్మశక్యంగా లేకున్నా... మొదటి భార్యను చేసుకున్న తర్వాత ఎంతకాలం వెయిట్ చేసిన పిల్లలు పుట్టరట. అయితే రెండో భార్యకు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య కూడా పిల్లలు జన్మిస్తారట. వినడానికి వింతగా ఉన్నా కానీ, ఆ ఊరి ప్రజలకు మాత్రం అలానే జరుగుతుందట. అందుకనే మొదటి భార్య కూడా తన భర్తకు దగ్గర ఉండి మరి రెండో పెళ్లి చేస్తుందట. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: