వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో మంత్రి పదవులు రెండు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో వారి స్థానంలో ఎవరు వస్తారు అనే అంశంపై కొద్ది రోజులుగా పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. జగన్ కు వేరు విధేయులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభ అభ్యర్ధులుగా నిలబెట్టి గెలిపించడంతో త్వరలోనే ఆ రెండు మంత్రి పదవులకు వారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ ప్రక్షాళనకు జగన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ గవర్నర్ ను జగన్ కలిశారు. ఇదిలా ఉంటే ఆ రెండు పదవులను ఏ ఏ సామాజిక వర్గాల వారితో భర్తీ చేస్తారు ? ఏ అంశాలను  పరిగణలోకి తీసుకుంటారనే విషయం తేలకుండా ఉంది. ప్రస్తుతం రాజీనామా చేయబోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన వారితో జగన్ మంత్రి పదవి భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

 

IHG


ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో బిసి సామాజిక వర్గానికి చెందిన వారిని ఆ పదవిలో నియమించాలని జగన్ చూస్తున్నారట. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో బీసీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, ఎం శంకర్ నారాయణ, జె ఎస్ రాములు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరిలో మోపిదేవి, పిల్లి ఎలాగూ రాజీనామా చేస్తారు కాబట్టి మిగిలిన ఐదుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే అంశం తెరపైకి వస్తుంది. బొత్స సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చినా, అదే జిల్లాకు చెందిన పుష్పశ్రీవాణి ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉండడంతో, ఆయనకు అవకాశం లేదు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RK' target='_blank' title='rk -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rk </a>Roja wins in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NAGARI' target='_blank' title='nagari-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>nagari</a>, defeats <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TDP' target='_blank' title='tdp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tdp</a> ...

 అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ ఉన్నా, ఇప్పటికే ఏపీ స్పీకర్ వంటి కీలక స్థానాన్ని ఆ జిల్లాకు జగన్ కట్టబెట్టారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడైన శంకర్ నారాయణ ఉన్నా, ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు, ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోవడం, ఆయన మెతకవైఖరి పనికిరాదనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి దక్కుతుంది అనే వాదన తెరపైకి వస్తోంది. ఇక మరో మంత్రి పదవిని జగన్ కు అత్యంత సన్నిహితురాలు, మొదటి నుంచి వైసీపీ లో ఉంటూ బలమైన వాయిస్ వినిపిస్తూ వస్తున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు కూడా వైసీపీ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: