కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే పాజిటివ్ వస్తున్న అన్నీ కేసుల్లో లక్షణాలు కనిపించడంలేదు. అందుకే సీరియస్ గా ఉన్న రోగులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తూ.. ఎలాంటి లక్షణాలు లేని పేషంట్లకు ఇంటి దగ్గరే చికిత్స అందిస్తున్నారు. 

 

కరోనా అంటే భయం. కరోనా పాజిటివ్ కేసు వస్తే.. ఆ వైపుకు ఎవరినీ పోనివ్వకుండా కంటైన్మెంట్ జోన్ చేసేవారు. కరోనా రోగిని గాంధీ ఆసుపత్రికి తరలించి.. ఆ పరిసరాల్ని సానిటైజ్ చేసేవారు. ఒకరకంగా చెప్పాలంటే.. నిన్న, మొన్నటివరకు కరోనా వచ్చిన వాళ్ళను అంటరాని వాళ్లుగా చూశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో.. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ను మార్చింది. పైగా కరోనా వచ్చిన వాళ్లందరిలో అసలు లక్షణాలు కూడా కనిపించని వారే ఎక్కువగా ఉంటున్నారు. అందువల్ల లక్షణాలు లేని పేషెంట్స్‌ను ఇళ్ల వద్దే ఉంచి.. చికిత్స అందించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి.. లక్షణాలు లేని కరోనా రోగులకు హోం ట్రీట్మెంట్ అందిస్తోంది. వీరంతా 17 రోజుల పాటు ఇంటి వద్దనే ఉంటూ వైద్యుల సలహాలతో చికిత్స పొందుతున్నారు. దీనివల్ల కరోనా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నవారికి ఆసుపత్రుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వీలు కలుగుతోంది. అందుకే లక్షణాలు లేని వాళ్ళకు..ఇళ్ళలోనే ట్రీట్ మెంట్ చేస్తున్నామంటుంది ప్రభుత్వం.

 

అయితే ఇంట్లో కరోనా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇంట్లో పిల్లలు, 60 ఏళ్ల పై బడిన వాళ్ళు వేరుగా వుండాలి. ఇంట్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వ్యక్తి ప్రత్యేక ఆహారం తీసుకోవాలి. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా.. వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యాలి. హోం ఐసోలేషన్ లో ఉండే వాళ్ళకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తోంది.  

 

ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి హోం కేర్ పేరుతో సర్వీసులు అందిస్తున్నాయి. ఒక్కో ఆస్పత్రి 14 వేల నుంచి 20 వేల వరకు హోం క్వారంటైన్ కాలంలో.. ప్రత్యేక ప్యాకేజీల ద్వారా చార్జ్ వేస్తున్నాయి. ముఖ్యంగా రోగులకు మెడికల్ కిట్ ఇస్తున్నాయి. దానిలో పల్స్, సాచురేషప్ రీడింగ్ మిషన్స్ తో పాటూ రోగ నిరోధక శక్తి పెంచేందుకు విటమిట్ ట్యాబ్లెట్స్ కిట్ ను అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: