అతి వైభవంగా  ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి. ఈ మేరకు భక్తులు, భవానీలు దర్శించుకొని తరిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం, పరమార్థం ఉన్నాయి. త్రి శక్తుల లో ఒక మహాశక్తి సరస్వతీ దేవి. అమ్మవారు సప్తరూపాల లో ఉంటుందని మేరు తంత్రంలో ఉంది. నేడు ఐదవ రోజు ఈ సందర్భంగా అమ్మవారిని సరస్వతి రూపం లో అలంకరించడం జరిగింది.  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఇంద్రకీలాద్రి కి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయడం జరిగింది.

సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ తన నివాసం నుండి బయల్దేరతారు. ఆ తర్వాత 3.40 కి దుర్గమ్మ గుడిని చేరుకొని పట్టు వస్త్రాలు అమ్మవారికి అర్పిస్తారు. అది అయిపోయాక  4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసినదే. అయితే ప్రస్తుతం దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నారు.

అలానే మాస్క్ తప్పని సరి చేశారు. భక్తులు ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: