తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం జగన్ మోహన్ రెడ్డి ని నమ్మి ఒకే ఒక్కసారి  ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇవ్వడం వల్లే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని ఒంగోలు పార్లమెంటరీ పరిధి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసే కార్యక్రమం పాల్గొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి
 చెప్పేవన్నీ అబద్దాలు..చేసేవన్నీ తప్పుడు పనులని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులు,దౌర్జన్యాలు..ఎక్కడ చూసినా హింసా విధ్వంసాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.


ఇంతగా బరితెగించిన పార్టీని ఎక్కడా చూడలేదని  బాధ్యతగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ తీసుకున్న బాధ్యతలో, పదోవంతు వైసీపీ తీసుకున్నా రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. .
 ప్రతిపక్షాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం, అక్రమ నిర్బంధాలు, .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవని అన్నారు. సీఎం జగన్‌కు కమిషన్ ఏజెంట్లుగా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు మారారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని... వాటి పేర్లు మార్చారే తప్ప, వైసీపీ కొత్తగా చేసిందేమీ లేదని మండిపడ్డారు.


ఈ పరిస్థితుల్లో టిడిపిపై చారిత్రకమైన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు.     అటు రాష్ట్ర అభివృద్ది, ఇటు పేదల సంక్షేమం కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కరోనా బాధితులకు అండగా ఉండాలని... రైతులు, మహిళలు, యువత, బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు కోరారు.చేసేవన్నీ తప్పుడు పనులని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.  దేశంలో  కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాలలో 5 జిల్లాలు ఏపిలో ఉంటే, అందులో ప్రకాశం జిల్లా ఒకటి కావడం బాధాకరమని అన్నారు. వైసిపి దౌర్జన్యాలను, అక్రమాలను అడుగడుగున అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ కావాలని చంద్రబాబు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: