ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పోలవరం అంశం గురించి కాస్త ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోవడం వెనుక కారణం ఏమిటి అనే దానిపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి. అసలు దీని వెనుక కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ముందు నుంచి కూడా అన్యాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్రంతో సీఎం జగన్ అన్ని విధాలుగా కూడా సఖ్యత కొనసాగిస్తున్న సరే కేంద్రం మాత్రం ఈ విధంగా ప్రవర్తించడంతో ఇప్పుడు జగన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి విషయంలో అయినా మరో విషయం అయినా కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించిన సంగతి తెలిసిందే. అయినా కేంద్రం మాత్రం ఇలా కయ్యాలు పెట్టుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా కలిసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందుగా అధికారులను పంపించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. జలవనరుల శాఖ అధికారులను ఢిల్లీ పంపించి కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు వ్యయాలను వివరించే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే జగన్ ఒక నిర్ణయం తీసుకోవాలి అధికారులను ఢిల్లీ పంపించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దానిపై కూడా ఒక రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: