ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సాధారణంగానే పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఎప్పుడు యుద్ధవాతావరణం నెలకొని ఉంటుంది. ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్ ఏదో ఒక విధంగా ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడేలా  చేసి విధ్వంసం సృష్టించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో.. భారత సైన్యంపై కోపం తో రగిలిపోతున్న పాకిస్తాన్ సైన్యం ఇటీవలే భారత సైన్యంపై కాల్పులు జరపడంతో మరింత ఉద్రిక్తంగా మారిపోయింది సరిహద్దుల్లో పరిస్థితి.



 ఇక ఏకంగా పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్రమత్తమైన భారత సైన్యం ఎడతెరిపి లేకుండా కాల్పులు జరపడంతో కనీసం కోలుకునేందుకు కూడా పాకిస్తాన్ కు  సమయం లేకుండా పోయింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాకిస్తాన్ సైనికులు సరిహద్దుల నుంచి పరుగులు పెట్టారు. అయినా  వదలని భారత సైన్యం ఏకంగా  పాకిస్తాన్ సరిహద్దు లోకి ఐదు కిలోమీటర్ల వరకు దూసుకుపోయే దాడి చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు.. ఆయుధ డంపులను కూడా  పూర్తిగా ధ్వంసం చేస్తుంది భారత్.



 ఇది ఒక రకంగా పరోక్ష యుద్ధం అని అంటున్నారు విశ్లేషకులు. ప్రత్యక్షంగా జరుగుతున్న పరోక్ష యుద్ధం అని అభివర్ణిస్తున్నారు. ఈ పరోక్ష యుద్ధాన్ని ప్రత్యక్ష యుద్ధంగా  మార్చాలా లేదా... ఇంతటితో ఆపెయ్యాల  అన్నది పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది అని అంటున్నారు. పాకిస్తాన్ బుద్ది  మార్చుకోకుండా ఉగ్రవాదులతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించడంతో పాటు పాకిస్తాన్ సైన్యాన్ని భారత సైన్యంపై ఉసిగొల్పితే  మాత్రం రానున్నరోజుల్లో భారత్ పాకిస్తాన్ పై యుద్ధం చేయడం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: