ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ లోకి ప్రతిపక్ష నేతలు వెళ్ళడం సహజం.. ఇక ఏపీ లో అయితే ఈ చేరికల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే జగన్ వీటికి చెక్ పెట్టె విధంగా రాజీనామా అనే అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు.. దాంతో చాలామంది ప్రతిపక్ష నేతలు రాజీనామాలు చేయడం ఇష్టం లేక పార్టీ కి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ కి మద్దతు తెలుపుతూ తమ కుటుంబ సభ్యులను వైసీపీ లోకి చేర్చారు. అయితే ఇలా వచ్చిన వారు టీడీపీ పై ఘాటుగా విమర్శలు చేయడం ఇప్పడు సర్వత్ర సంచలనాన్ని రేకెత్తిస్తుంది..

విశాఖ లోఇప్పటికే టీడీపీ ప్రధాన నేతలందరూ వైసీపీ గూటికిచేరిపోయారు. ఇక మిగిలింది విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. అయన కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు చంద్రబాబు మీద ద్వేషం లేదు, జగన్ మీద ప్రేమ అంతకంటే లేదు, కేవలం తాను తన అనుచరులు అక్రమంగా చేసిన భూ దందాల నుంచి అర్జంటుగా రక్షణ కావాలి. అందుకే ఆయన అప్పట్లో వైసీపీ వైపు వేగంగా అడుగులు వేశారని చెబుతారు. అయితే ఇది గమనించిన జగన్ ఆయనకు స్వాగతం పలకలేదు.

అయితే ఇప్పుడు జగన్ కి గంటా టార్గెట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. గత పది నెలలుగా విశాఖలో అక్రమ నిర్మాణాలతో పాటు, భూ దందాలను కూడా వైసీపీ సర్కార్ తవ్వి తీస్తోంది. మరో వైపు చంద్రబాబు హయాంలో వచ్చిన సిట్ నివేదికతో పాటు, జగన్ వేసిన కొత్త సిట్ ద్వారా కూడా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. దాంతో పెద్ద తలకాయలు చాలా మంది విశాఖ భూములను చాప చుట్టేశారని కచ్చితమైన ఆధారాలతో సహా వైసీపీ సర్కార్ వద్ద ఉన్నాయి. అందులో పెందుర్తి నియోజకవర్గంలో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరుల దందా కూడా బయటపడిందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: