తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం టిఆర్ఎస్ పార్టీ చుక్కలు చూస్తుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనితో ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న నాయకులందరిని కూడా దగ్గర చేసుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చాలామంది కీలక నేతలు ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా కొంతమంది కీలక నేతలకు ఫోన్ చేస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేయాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు సూచనలు చేస్తున్నారు. నిజాంపేట సహా కొన్ని ప్రాంతాల్లో ఆయనకు మంచి పట్టు ఉందని కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేస్తే బాగుంటుందని తుమ్మల నాగేశ్వర రావుకి ఫోన్ చేసినట్లుగా సమాచారం. అయితే ఆయన మాత్రం ఇప్పుడు హైదరాబాదులో ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో...

కీలక నేతలు అందరూ ప్రచారం చేస్తే అవకాశాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసహనంగా ఉన్న నేపథ్యంలో నాగేశ్వరరావు వారితో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. వారందరితో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన చాలామంది నేతలు ఇప్పుడు హైదరాబాదులో అసహనంగా ఉన్నారు. కాబట్టి వారందరితో కూడా ఆయన చర్చలు జరుపుతూ ఉంటే బాగుంటుందని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే తుమ్మల నాగేశ్వరరావుకి స్వయంగా ఫోన్ చేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: